వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో కాన్వాయ్ వాహనాల్లో ఉన్న భద్రతా సిబ్బంది, కాంగ్రెస్ కార్యకర్తలు పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా బృందాలు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించాయి. వాహనాలు వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో ముందు వెళ్తున్న వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా, లేక ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.