దాదాపు 5 నెలలుగా ఎవరికీ కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్న ప్రధాన నిందితురాలు కల్పనతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకోసం కల్పన కుమారుడు ముంబయికి వస్తున్నాడనే సమాచారం తెలుసుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతని ద్వారా కల్పనను నేపాల్ నుంచి భారత్కు రప్పించి పట్టుకున్నారని తెలుస్తోంది. ఆమె ఇచ్చిన సమాచారంతో మిగిలిన నలుగురు నిందితులను కూడా వ్యూహాత్మకంగా వలపన్ని అరెస్ట్ చేశారు. దాదాపు 5 నెలల పాటు సాగిన ఈ ఆపరేషన్ ముగిసింది. కాగా అరెస్ట్ చేసిన నిందితులందరినీ రేపు మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని సమాచారం.