అయితే రైతు భరోసా ఇవ్వడానికి 9 వేల కోట్ల రూపాయలు అవసరం కాగా, ఆ నిధులను సమకూర్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. మొదట్లో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని రైతు భరోసా ఇవ్వాలని భావించినప్పటికీ, ప్రస్తుతం ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. నిన్న గాంధీభవన్లో జరిగిన PAC సమావేశంలో, కరువు సాయం కింద కేంద్రాన్ని 30 వేల కోట్ల రూపాయలు కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేసింది. ఆ నిధులను కేంద్రం విడుదల చేస్తేనే యాసంగి రైతులకు రైతు భరోసా విడుదల చేసే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రైతు భరోసా నిధులు జమ అవుతాయా లేదా అని రైతులు ఆందోళన చెందుతున్నారు.