9999 Coconut Ganesh Idol: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా రాజమండ్రిలో కొబ్బరిబోండాల వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పుష్కర ఘాట్ వద్ద గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ ఏడాది నందీశ్వర నారికేళ గణపతిని ఇలా కొబ్బరి బొండాలతో ప్రతిష్టించారు. నారికేళ గణపతిని దర్శించుకునేందుకు రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.