AP MPP ZP Chairman Election: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిందని ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) అనిల్ చంద్ర పునేట తెలిపారు. ఇప్పటికే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు విజయవంతంగా ముగియగా, తదుపరి దశలో నవంబర్ 19న ఎంపీపీ, నవంబర్ 20న జెడ్పీ చైర్మన్ల పరోక్ష ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అలాగే నవంబర్ 23న 100 పురపాలక సంఘాలు కొలువుదీరనున్నాయని వెల్లడించారు.