Published: Sep 14, 2026, 12:10 PM|Updated: Sep 14, 2026, 05:55 PM
BRICS Dollar Declaration 2026: న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సులో భారత చొరవతో రూపొందించిన 'ఢిల్లీ డిక్లరేషన్' ఉమ్మడి ప్రకటనపై సభ్య దేశాలన్నీ ఏకాభిప్రాయంతో ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి. ఈ సదస్సులో భారత దౌత్యనీతి మరోసారి అత్యంత కీలక పాత్ర పోషించింది. అంతర్జాతీయ వివాదాలను దౌత్య చర్చల ద్వారా పరిష్కరించుకోవడం, వాణిజ్యంలో స్థానిక కరెన్సీల వినియోగం, ప్రపంచ సంస్థల్లో సంస్కరణలు, ఆర్థిక వృద్ధి, ఉగ్రవాద నిర్మూలన వంటి 5 ప్రధాన అంశాలపై ఒప్పందం కుదిరింది. బ్రిక్స్ దేశాల వాణిజ్యంతో వారివారి స్థానిక కరెన్సీల్లో వ్యాపారం చేసేందుకు డీల్ కుదిరింది. ఈ క్రమంలో డాలర్‌కు పెద్ద దెబ్బ పడే అవకాశం ఉంది.