ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై హైకోర్టు మరికొన్ని గంటల్లో తీర్పును వెలువరించనుంది. బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికై, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసిన దానంపై అనర్హత వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ సాయంత్రం తీర్పును ప్రకటించనుంది.