Published: Sep 14, 2026, 12:15 PM|Updated: Sep 14, 2026, 05:54 PM
Dhee Dancer Raju Arrest: తెలుగు బుల్లితెరపై విశేష ప్రాచుర్యం పొందిన 'ఢీ-10' డ్యాన్స్ రియాలిటీ షో విజేతగా నిలిచి, కొరియోగ్రాఫర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజు తీవ్రమైన వివాదంలో చిక్కుకున్నాడు. ఒక యువతిని లైంగికంగా వేధించాడనే సంచలన ఆరోపణలతో అతడు కటకటాల పాలయ్యాడు. రాజును అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి అతనికి రిమాండ్ విధించారు. అయితే, ఈ కేసులో మరో అమ్మాయి పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం బుల్లితెర, డ్యాన్స్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.