Published: Sep 16, 2026, 07:10 PM|Updated: Sep 16, 2026, 07:12 PM
Dhee Raju Audio Call Leak: తెలుగు బుల్లితెరపై విశేష ప్రాచుర్యం పొందిన 'ఢీ-10' డ్యాన్స్ రియాలిటీ షో విజేతగా నిలిచి, కొరియోగ్రాఫర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజు తీవ్రమైన వివాదంలో చిక్కుకున్నాడు. ఒక యువతిని లైంగికంగా వేధించాడనే సంచలన ఆరోపణలతో అతడు కటకటాల పాలయ్యాడు. రాజును అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి అతనికి రిమాండ్ విధించారు. అయితే, ఈ కేసులో మరో కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. బాధితురాలు పేరిట డ్యాన్సర్ రాజుతో మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డింగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.