పార్కు చుట్టూ ఉన్న వన్-వే విధానం వల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో, ఈ విధానాన్ని మరింత మెరుగుపరిస్తే ప్రతిపాదిత స్టీల్ బ్రిడ్జి, అండర్‌పాస్‌ల అవసరం ఉంటుందా అనే అంశంపై GHMC అధికారులు ట్రాఫిక్ పోలీసుల ఉన్నతాధికారులతో చర్చలు ನಡೆಸతున్నారు. ఈ ప్రతిపాదనను పూర్తిగా ఉపసంహరించుకోవాలా లేదా మార్పులు చేసి కొనసాగించాలా అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. సుమారు రూ.1,090 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టాల్సిన ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్‌పాస్‌ల నిర్మాణాలను యథాతథంగా కొనసాగించాలా లేక ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా మార్పులు చేయాలా అనే అంశంపై అధికారులు ఆలోచిస్తున్నారు. దీనిపై GHMC అధికారులు ట్రాఫిక్ పోలీసులతో పాటు నిపుణులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు, పార్కు చుట్టూ 453 ఆస్తుల సేకరణ కూడా