స్వామివారిని దర్శించుకున్న డీకే అరుణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం, దేశ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని.. వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా గణనాధుని ఆవరణలో మహిళలతో కలిసి ఎంపీ డీకే అరుణ కోలాటం ఆడారు.