Ganesh Immersion Ban In Tank Bund: వినాయక చవితి ఉత్సవాల వేళ భక్తులకు భారీ షాక్ తగిలింది. ట్యాంక్‌బండ్‌లో గణేష్ వినాయకులు నిమజ్జనం చేయొద్దు అంటూ అధికారులు ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. వినాయక విగ్రహాల నిమజ్జనం చేయరాదంటూ అప్పర్ ట్యాంక్ బండ్‌పై జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దు అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం కలకలం రేపింది.