Published: Oct 31, 2026, 06:45 PM|Updated: Oct 31, 2026, 06:47 PM
Raptadu Incident Video: ఏపీలోని అనంతపురం జిల్లా రాప్తాడులోని స్థానిక పాఠశాలలోకి చొరబడిన ఓ ఉన్మాది రంపంతో అరాచకం సృష్టించిన వార్త ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై ఓ ఆగంతకుడు చెట్లు కట్ చేసే రంపంతో విరుచుపడ్డాడు. ఈ ఘటనలో గాయపడ్డ విద్యార్థిని ఆరోగ్యం విషమించింది. ఇప్పటికే ఆమె ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఖండించారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని వారు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.