Telangana Cheyutha Pension Last Date: తెలంగాణలో కొత్తగా ప్రభుత్వ పింఛన్లు కోరుకుంటున్న వారికి ముఖ్యమైన సమాచారం. ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ఉండటం వల్ల అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. నిన్నటితో గడువు ముగిసినప్పటికీ, చేయూత పింఛన్ల దరఖాస్తు గడువును మరో రోజు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు, మీ-సేవ కేంద్రాలకు వరుసగా 3 రోజులు సెలవులు రావడం వల్ల దరఖాస్తు చేసుకోవడంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ఈ వెసులుబాటు కల్పించింది. ఈ తాజా పొడిగింపు ద్వారా అర్హులైన అభ్యర్థులు నేటి