తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులను ఆకట్టుకునేలా టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఫ్లవర్ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. వివిధ రకాల పూలు, రంగు రంగుల రోజా పుష్పాలతో ఈ ప్రదర్శనను అందంగా తీర్చిదిద్దారు. పూలతో రూపొందించిన దేవతామూర్తుల ఆకృతులు ఈ ఎగ్జిబిషన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు ఈ పుష్ప ప్రదర్శనను ఆసక్తిగా తిలకిస్తున్నారు. దేవతామూర్తుల పుష్ప ఆకృతుల ముందు ఫొటోలు దిగుతూ సందడి చేస్తున్నారు. ప్లవర్ ఎగ్జిబిషన్ ఏర్పాటుపై మరింత సమాచారం మా ప్రతినిధి మధుసూదన్ రెడ్డి అందిస్తారు.