Published: Nov 02, 2026, 07:35 PM|Updated: Nov 02, 2026, 07:44 PM
YS Jagan: ఏపీలోని అనంతపురం రాప్తాడులో ప్రభుత్వ పాఠశాలలో దాడికి గురైన బాలిక మణిపాల్ లో చికిత్స పొందుతుంది.ఈ క్రమంలో వైఎస్ జగన్ బెంగళూరుకు వెళ్లి బాలికను పరామర్శించారు. బాలిక ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశారు. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. తమ పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. గంజాయి, బెల్టు షాపులే రాప్తాడు ఘటనకు కారణంమని కూటమి పాలనపై మండిపడ్డారు. వీటిని అరికట్టడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని ఎద్దేవా చేశారు.