Published: Nov 01, 2026, 02:55 PM|Updated: Nov 01, 2026, 03:09 PM
YS Jagan Protest: వైఎస్ జగన్ పులివెందుల ఆర్వోకార్యాలయంకు వెళ్లి ఎన్నికల్లో అక్రమాలపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆర్వో శ్రీనివాస్, ఆర్డీవో చిన్నయ్యలతో మాట్లాడారు. తమ ఏజెంట్లను ఎన్నికల సెంటర్ లోకి వెళ్లకుండా అడ్డుకున్నారన్నారు. ఎన్నికల్లో పోటి ఉండాలని, ఎక్కడ చూసి టీడీపీ శ్రేణులు విచ్చల విడిగా తిరుగుతున్నారంటూ మండిపడ్డారు. అనేక పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు లేవన్నారు. బీహర్ తరహా జంగిల్ రాజ్ ఇక్కడ కన్పిస్తుందని, తాము కూడా అనుకుంటే ఇలాంటి దాడులు చేయడం పెద్ద విషయం కాదని జగన ఆర్వో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసనలు తెలిపారు.