Published: Nov 01, 2026, 03:25 PM|Updated: Nov 01, 2026, 03:29 PM
YS Jagan: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఆర్వో కార్యాలయం వద్ద నిరసనలకు దిగారు. పులివెందుల ఎన్నికల హింసాత్మక ఘటనలపై మండిపడ్డారు. పులివెందుల, కడప, జమ్మల మడుగు, మాచర్ల, తాడిపత్రి, మదన పల్లి మొదలైన చోట్ల టీడీపీ అరాచకాలు చేసిందన్నారు. పులి వెందులలో 70 బూతుల్లో వైసీపీ ఏజెంట్లను వెళ్లనివ్వలేదన్నారు. ఉదయం నుంచి బూత్ క్యాప్చర్ లకు పాల్పడ్డారన్నారు. స్లిప్ లను చింపేయడం, పోలింగ్ ఏజెంట్ లపై దాడులు చేశారన్నారు. ఎస్పీ, కలెక్టర్ చివరకు ఆర్వో వద్దకు వచ్చి ఫిర్యాదు చేసిన రెస్పాన్స్ లేదని జగన్ వాపోయారు. అసలు దీన్ని ప్రజాస్వామ్యం అంటారా..?.. అని వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.