YS Jagan In Pulivendula: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాజకీయ పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. పోలింగ్ ప్రారంభమైన ఉదయం సమయం నుంచే కడప, పులివెందుల ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ), వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) కార్యకర్తల మధ్య పరస్పరం తీవ్ర స్థాయిలో రాళ్లదాడులు చోటుచేసుకున్నాయి. మరోవైపు పలు పోలింగ్ కేంద్రాలలో తమను లోనికి అనుమతించడం లేదంటూ వైసీపీ పోలింగ్ ఏజెంట్లు ఆందోళన బాట పట్టారు. విధులు నిర్వహిస్తున్న పోలీసులు తటస్థంగా ఉండకుండా, దగ్గరుండి టీడీపీ కార్యకర్తలకు పూర్తిగా సహకరిస్తున్నారని వైసీపీ శ్రేణులు తీవ్రంగా విమర్శించాయి. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ఎన్నికల అధికారి ఆఫీసు ముందు బైటాయించారు. ఈ క్రమంలో