AP Telangana Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. ఉత్తర ఒడిశా నుంచి ఉత్తర ఛత్తీస్‌గఢ్ వైపు కదిలిన అల్పపీడనం, దక్షిణ నైరుతి గాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ముఖ్యంగా ఈ నెల 23, 24, 25 తేదీల్లో కోస్తాంధ్ర, యానాంలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. పెద్ద తుఫాను ముప్పు తప్పినప్పటికీ, రెండు నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రైతాంగంలో తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు స్థానిక పంచాయతీ, పురపాలక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు రక్షణ చర్యలపై దృష్టి సారించింది.