Venu Swamy Warning to Nani: హీరో నానికి ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా నాని హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్’ మూవీలో సవారి జాతికి చెందిన నాని వాళ్ల సమూహం ధూమావతి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇందులో ధూమావతి అమ్మవారి పూజపై వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Nagaland Poison Liquor Deaths: నాగాలాండ్‌లో విషపూరితమైన కల్తీ మద్యం మార్కెట్లో విచ్చలవిడిగా సరఫరా అవుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. అయితే గత రెండు రోజుల్లో ఈ కల్తీ మద్యాన్ని సేవించిన 19 మంది తమ ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు తీవ్ర కలవరాన్ని సృష్టిస్తోంది. దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసి 19 మందిని అరెస్టు చేసి, 3,000 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుంది.
Contra Costa Therapist Case: దారి తప్పిన మైనర్లను సక్రమంగా చూసుకుంటూ.. మంచి మార్గాల్లో పెట్టాల్సిన ఓ మహిళ హెల్త్ థెరపిస్ట్ చేసిన అఘాయిత్యం ఇప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తన దగ్గరికి కౌన్సిలింగ్ కోసం వచ్చిన ఓ మైనర్ బాలుడిని లై**గికంగా వినియోగించుకున్న ఘటన కాలిఫోర్నియాలోని చోటుచేసుకుంది. అసలు ఏం జరుగుతుంది? దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
5 Delicious Egg Curries: కోడిగుడ్డు.. ఇది మంచి పోషకాహారం. దీనిలో శరీరానికి కావాల్సిన ప్రొటీన్స్, విటమిన్స్, ఐరన్, పాస్ఫరస్, జింక్, సెలీనియం, కోలిన్ వంటి పోషకాలెన్నో పుష్కలంగా ఉంటాయి. అందుకై వైద్యులు కూడా రోజూ ఒక బాయిల్డ్ ఎగ్ తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని సలహా ఇస్తుంటారు.
India Vs Iran Kabaddi 2026: ఆసియా క్రీడలలో భారత మహిళల కబడ్డీ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ పోరులో బలమైన ఇరాన్ జట్టుపై విజయం సాధించి, ఆసియా కబడ్డీలో భారత్ తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయించింది. ఈ చారిత్రాత్మక విజయంతో ఆసియా క్రీడల్లో భారత్ తన మొత్తం పతకాల సంఖ్యను 27కి పెంచుకుంది.
Vijayawada Women Kalyani murder case: ఆంధ్రప ప్రదేశ్ NTR జిల్లా విజయవాడ ఇబ్రహీంపట్నం థర్మల్ పవర్ స్టేషన్ వద్ద కూలింగ్ కెనాల్‌లో యవతి డెడ్ బాడీ లభ్యమవ్వడం కలకలం రేపింది. మొదట కాలువలో యువతి మొండెం కనిపించగా స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ కేసు ప్రస్తుతం సంచలనంగా మారింది.
Monkey Drinks Alcohol in Jharkhand Video: ఓ కోతి మద్యం షాపులోకి దూరి.. మద్యం బాటిల్లను విక్రయిస్తున్న సమయంలో అందులో నుంచి ఓ బాటిల్ను తీసుకొని నోటి సహాయంతో దానిపై ఉండే మూతను తీసి.. గుట గుట తాగేసింది.. అయితే, దానికి విపరీతమైన మత్తెక్కడంతో.. అక్కడే పడుకుండి పోయింది.. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Ola S1 X Down Payment: ప్రతి నెల కేవలం మీరు రూ. 2,303తో EMI చెల్లించి మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే..OLA S1 X 2 kWh స్కూటర్ ది బెస్ట్ ఆప్షన్‌గా భావించవచ్చు. ఎందుకంటే ఇది తక్కువ ధరలో అత్యంత తక్కువ డౌన్ పేమెంట్తో కొనుగోలు చేయొచ్చు. అయితే, దీనికి సంబంధించిన బడ్జెట్ ప్లానింగ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Maruti Suzuki Brezza 4 Lakh Down Payment: ఎప్పటినుంచో మీరు కూడా మారుతి సుజుకి బ్రెజ్జా ఎల్‌ఎక్స్‌ఐ పెట్రోల్ 1.0 లీటర్ టర్బో మాన్యువల్ SUV కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ముఖ్యంగా EMI ఆప్షన్ తో కొనుగోలు చేయాలనుకునే వారికి అద్భుతమైన బడ్జెట్ ప్లానింగ్ వివరాలను అందిస్తున్నాం.. ఇందులో భాగంగా అత్యంత తక్కువ EMI ఆప్షన్ తో ఎలా కొనుగోలు చేయాలి? ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి? అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Mamitha Baiju మమితా బైజు పేరు ఇప్పుడు తెలుగు ఆడియన్స్‌కు కొత్త పరిచయాలు అక్కర్లేదు. ముఖ్యంగా ‘ప్రేమలు’ మలయాళ డబ్బింగ్ మూవీతో ఈ కేరళ కుట్టీ తెలుగులో కూడా మంచి గుర్తింపు వచ్చింది. తన సహజసిద్దమైన నటన, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో యూత్‌కు దగ్గరైంది. తాజాగా ఈమె తెలుగు సినిమాల విషయంలో ఓ సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
Kaakaa Release on Sankranthi Release: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కాకా’. ముందుంచి ఈ సినిమాను జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ‘విశ్వంభర’ సినిమా విడుదల నేపథ్యంలో ఈ చిత్రాన్ని పొంగల్‌కు విడుదల చేస్తున్నట్టు వస్తున్నాయి. మరోవైపు ‘కాకా’ సినిమా సంక్రాంతి నుంచి సమ్మర్‌కు పోస్ట్ అయినట్టు వార్తలు వచ్చాయి. దానిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
Ganesh Nimajjanam: హైదరాబాద్ లో గణేశ్ శోభాయత్ర, నిమజ్జనం ప్రశాంతంగా సాగుతోంది. ఇవాళ మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు గణేష్ నిమజ్జన శోభాయాత్ర కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వినాయక్ సాగర్‌కు వినాయక విగ్రహాలు బారులు తీరాయి.
Prashna Ravan Funds Case: యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ ఎలియాస్ ప్రశ్న రావణ్ బ్యాంక్ ఖాతాకు భారీ ఎత్తున విదేశీ నిధులు జమ అయినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి నిందితుడిని పోలీసులు ఏడు రోజుల పాటు సుదీర్ఘంగా విచారించగా పలు కీలక విషయాలు బయటపడ్డాయి. రావణ్‌కు విదేశాల నుంచి విడతల వారీగా రూ.29 లక్షలకు పైగా జమ కాగా, వైకాపా నేత ఇంద్రసేనానాయుడు ఖాతా నుంచి దాదాపు రూ.25 లక్షలు అందాయని అధికారులు గుర్తించారు.
తెలంగాణకు చెందిన భూక్యా యశ్వంత్ అరుదైన రికార్డు సృష్టించారు. పర్వతారోహకుడైన ఆయన, హర్ శిఖర్ పర్ తిరంగా మిషన్ లో భాగంగా నాగాలాండ్ లోని అత్యంత ఎత్తైన సారామతి శిఖరాన్ని అధిరోహించి రికార్డు నమోదు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
Telangana High Court: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించిన పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్ ను ఏపీలో బీడీఎస్ పూర్తి చేసిన విద్యార్థికి తెలంగాణలో ఎండీఎస్ ప్రవేశాల్లో స్థానికత వర్తిస్తుందా లేదా అనే అంశంపై కౌంటర్లు దాఖలు చేయాలంటూ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం.. కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది.
Neecha Bhanga Raja Yoga Effect On Zodiac: అక్టోబర్ 31వ తేదీ వరకు నీచ భంగ రాజయోగ ప్రభావం ఈ క్రింది రాశుల వారిపై కొనసాగుతూ ఉంటుందని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అనుకున్న దానికంటే ఎక్కువగా ధన లాభాలు కలుగుతాయి. కోరుకున్న కోరికలు కూడా చాలా వరకు నెరవేరబోతున్నాయి. ముఖ్యంగా జీవితంలో అద్భుతమైన విజయాలు సాధించబోతున్నారు.
GO 25 Revision SGTU Demand: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అత్యంత అధ్వానంగా మారుతోంది. ఉపాధ్యాయుల తీవ్ర కొరతతో ప్రభుత్వ పాఠశాలల మునుపెన్నడూ లేని విధంగా సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నాయి.
Preeti Munde: మారుమూల గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన ఓ యువతి జాతీయ స్థాయి అందాల పోటీల్లో సత్తా చాటింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ గ్రామానికి చెందిన ప్రీతి ముండే ‘మిస్ ఇండియా ఎర్త్ వాటర్ 2026’ టైటిల్‌ను గెలుచుకుంది.
Gold Rate Today: గత కొన్నిరోజులుగా పతనం దిశగా కొనసాగుతున్న బంగారం ధరలు..నేడు శనివారం స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడలో ధరలు పెరిగినట్లు మనం గమనించవచ్చు. హైదరాబాద్ నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Chakali Ailamma Biography: భూమికోసం..భుక్తికోసం.. పేదల విముక్తి కోసం అంటూ కమ్యూనిస్టులు చెప్పే సిద్ధాంతం ఒక కులవ్రుత్తి చేసుకునే మహిళ నుంచి ఉద్భవించిందంటే మీరు నమ్మగలరా? స్త్రీలంటే చిన్నచూపు చూసేవారికి చాకలి ఐలమ్మ పోరాటం కనువిప్పు కలిగించిందని చెప్పాలి. పోలీసులను, దేశ్ ముఖ్ లను ఎదురించి తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో తన పేరును లిఖించుకున్న వీరవనిత చాకలి ఐలమ్మ. ఈ పోరాటం తర్వాతే నిజాంకు, దేశ్ ముఖ్ ల ఆగడాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం షురూ అయ్యింది. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఈ కథనం ద్వారా ఆ వీరమాతను స్మరించుకుంటూ నాటి పరిస్థితులను తెలుసుకుందాం.
కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో కీర్తి సురేష్, సనంత్, రిషికాంత్ నటించిన ‘డోరతీ’ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. LGBTQ, లింగ మార్పిడి అంశాలను కథలో ప్రస్తావించడంతో సినిమాపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రణబలి’ విడుదలపై వస్తున్న పుకార్లకు మేకర్స్ చెక్ పెట్టారు. అక్టోబర్ 16న సినిమా థియేటర్లలోకి వస్తుందని స్పష్టం చేస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.