Telangana Employees PRC Update: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలు, వివిధ డిమాండ్లపై స్పష్టత రాకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆవేదన, నిరాశ వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం రెండు కరువు భత్యం (DA) వాయిదాలు ఇచ్చేందుకు అంగీకరించినప్పటికీ, పే రివిజన్ కమిషన్ (PRC) నివేదిక సమర్పణలో జాప్యం, సీపీఎస్ (CPS) రద్దు, పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో మరింత ఆలస్యం జరిగే అవకాశం ఉందని జీ తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ శ్రీ భరత్ అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది అనగా 2027 ఏప్రిల్ 1 వరకు ఉద్యోగులకు ఊరటనిచ్చే ఎలాంటి ప్రకటన రాబోదని ఆయన వివరణ ఇచ్చారు.
Hyderabad Police Commissioner Sajjanar Ganesh Nimajjanam: అత్యంత వైభవంగా.. ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ వినాయక నిమజ్జనం కొనసాగుతోంది. ఉదయం నుంచి ప్రారంభమైన గణేశ్ శోభయాత్ర ఇంకా కొనసాగుతుండగా.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కీలక ప్రకటన చేశారు. నిమజ్జన ప్రక్రియపై కమిషనర్ ప్రకటన ఇదే!
Woman raped in raidurgam: ఒక పార్టీలో బాధితురాలికి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఆమెపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, రహస్యంగా వీడియోలు తీశాడు. ఆ తర్వాత ఆమెను బెదిరిస్తు రెస్టారెంట్ వ్యాపారం పేరుతో ఆమె నుండి సుమారు రూ.43 లక్షలు కాజేశాడు.ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
The paradise Congress vs BRS: నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ది ప్యారడైజ్ చిత్రం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పోలిన పాత్రను ఎంతో పాజిటివ్‌గా చూపించారనే అంశంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య సోషల్ మీడియా వేదికగా తీవ్ర వాదోపవాదాలు చెలరేగుతున్నాయి.
Ganesh laddu auction in Jagtial: జగిత్యాల పట్టణం గోవిందుపల్లె టీం సెవెన్ యూత్ గణేశ్ మండపంలో మహ్మద్ ఇషాన్ వేలం పాటలో పాల్గొనడమే కాకుండా ఏకంగా లడ్డును సైతం గెల్చుకున్నాడు. ఈ క్రమంలో స్థానికులు సదరు బాలుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Harish rao fires on cm revanth redddy govt: మల్లన్న సాగర్ నిండుకుండలా మారితే హైదరాబాద్ తాగునీటి అవసరాలతో పాటు, మీరు చెబుతున్న మూసీ ప్రాజెక్టుకు కూడా ఇక్కడి నుంచి నీటిని తరలించే అవకాశం ఉంటుంది. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌లోనూ 15 టీఎంసీలకు కేవలం 6 టీఎంసీలే ఉన్నాయని హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు.
Two years boy dies tragedy in Khammam: రెండేళ్ల బాలుడు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో బాలుడిని అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలిస్తుండగా వినాయక నిమజ్జనంలో శోభయాత్రతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో బాలుడు కరెక్ట్ టైమ్ కు ఆస్పత్రికి వెళ్లలోక ప్రాణాలు కోల్పోయాడు. ఖమ్మంలో ఈ ఘటన పెను విషాదకరంగా మారింది.
Khairatabad Ganesh Nimajjanm Completes Pics Goes Viral: గణేశ్ ఉత్సవాలు 11వ రోజు హైదరాబాద్‌లో ముగిశాయి. దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ భారీ వినాయకుడి నిమజ్జనం కోలాహలంగా ముగిసింది. తెల్లవారుజామున మొదలైన శోభయాత్ర అత్యంత వేగంగా పూర్తయ్యింది. ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జన ఫొటోలు చూసేయండి.
Telangana RTC Special Buses For Ganesh Nimajjanam: హైదరాబాద్‌లో కోలాహలంగా గణేశ్ మహా నిమజ్జనం కొనసాగుతోంది. అయితే నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాట కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం తొమ్మదిన్నర గంటలకు వేలంపాట నిర్వహించేందుకు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాట్లు చేసింది. వేలం పాట అనంతరం బాలాపూర్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమవుతుంది.
Khairthabad Bada Ganesh Nimmajjanam: ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అర్చకులు ఉదయం 5 గంటలకు స్వామివారికి పూజలు నిర్వహించారు. మరికాసేపట్లో శోభాయాత్ర ప్రారంభం అవుతుందని నిర్వాహకులు తెలిపారు. గణేష్ మండపం నుంచి టస్కర్ వాహనంపై శోభాయత్ర ప్రారంభం అవుతుంది.
Vinayaka Immersion 2026: వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీటి సరఫరాతో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తుల దాహార్తిని తీర్చేందుకు నగరంతో పాటు జలమండలి మూడు రీజియన్ల పరిధిలో (ఓఆర్ ఆర్ వరకు) గా 137 ప్రత్యేక తాగునీటి శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ ఎండీ తెలిపారు.
Balapur Laddu Auction 2026 Full Details: వినాయక చవితి ఉత్సవాల్లో బాలాపూర్ లడ్డూ వేలం ఎంతో విశేషమైనది. నవరాత్రుల పాటు విశేష పూజలు అందుకున్న లడ్డూ ఈసారి ఎంత వేలం ధర పలుకుతుందనేది ఉత్కంఠ నెలకొంది. బాలాపూర్ లడ్డూ వేలం విశేషాలు ఇలా ఉన్నాయి.
Hyderabad Ganesh Nimajjanam 2026: హైదరాబాద్ జంట నగరాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి లక్షలాది వినాయక విగ్రహాలు వినాయక సాగర్ (ట్యాంక్ బండ్), ఇతర చెరువుల వద్దకు నిమజ్జనానికి రానున్నాయి. ఈ మహా ఘట్టం కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్, భద్రత, జనసందోహాన్ని కంట్రోల్ చేయడానికి సుమారు 25 వేల నుంచి 30 వేల మంది పోలీసులను బందోబస్తులో ఉన్నారు.
KTR Statement: Supreme Court Slap To Rahul Gandhi And Revanth Reddy: నిస్సిగ్గుగా పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన దానం నాగేందర్‌పై సుప్రీంకోర్టు వేటు వేయడాన్ని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతించారు. సుప్రీంకోర్టు తీర్పు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి చెంపపెట్టు అని ప్రకటించారు.
MLA Padi Kaushik Reddy Hot Comments On Rahul Gandhi: తమ రెండున్నరేళ్ల పోరాటం తర్వాత దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడిందని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అద్భుతం అని చెప్పారు. రాహుల్ గాంధీకి కూడా ఈ తీర్పు చెంపపెట్టు లాంటిదేనని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రకటించారు.
Karakagudem Maoist History: ఒకప్పుడు తుపాకీ శబ్దాలు.. మందుపాతరల పేలుళ్లు.. పోలీస్ స్టేషన్‌పై మెరుపు దాడులు! ఇవే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం పరిస్థితులు. మావోయిస్టు ఉద్యమం ఉధృతంగా ఉన్న రోజుల్లో నెత్తుటి ఘటనలకు సాక్ష్యంగా నిలిచింది ఈ ప్రాంతం. కానీ, ఇప్పుడు కాలం మారింది! భయం నీడల నుంచి బయటపడి కరకగూడెం శాంతిభద్రతలు, అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. కరకగూడెంపై జీ తెలుగు న్యూస్ స్పెషల్.
సుప్రీంకోర్టులో దానం నాగేందర్‌కు భారీ షాక్ తగిలింది. రాష్ట్ర హైకోర్టులో తనపై దాఖలైన అనర్హత పిటిషన్‌ను కొట్టేయాలని కోరుతూ ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు ఈ అంశంపై సమగ్ర విచారణను నిర్వహించి, చివరకు దానం నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ కీలక తీర్పుతో ఇప్పుడు ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయమైనట్లు స్పష్టమవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాం.
Hyderabad Advocate Dating App: ఆన్‌లైన్ డేటింగ్ వేదికగా మహిళ రూపంలో పరిచయమై, వ్యక్తిగత సంభాషణలను బయటపెడతానని బెదిరిస్తూ ఓ న్యాయవాది నుంచి రూ. 5 కోట్లకు పైగా వసూలు చేసిన తీవ్ర సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. నిందితుడు తొలుత సానుభూతి మాటలతో లొంగదీసుకుని, ఆ తర్వాత బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడి బాధితుడి జీవిత కష్టార్జితాన్ని గుంజాడు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) అధికారులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విస్తృత దర్యాప్తు ప్రారంభించారు.
Telugu States Heavy Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు వాయుగుండం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు తెలంగాణలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి.అంతేకాదు వాతావరణ శాఖ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Telangana Employees DA Update: దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వం తమ ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల కోసం వెచ్చిస్తున్న రాబడి శాతం గణనీయంగా తక్కువగా ఉందని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అత్యధికంగా జీతాలు ఇస్తోందనే ప్రచారంలో వాస్తవం లేదని, రాష్ట్రం తన రాబడి రసీదుల్లో కేవలం 35 శాతం మాత్రమే ఉద్యోగుల కోసం ఖర్చు చేస్తోందని జీ తెలుగు న్యూస్ ఎడిటర్ శ్రీ భరత్ సుస్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక భారానికి ఉద్యోగుల జీతాలు కారణం కాదని, విచ్చలవిడిగా అమలు చేస్తున్న ఉచిత పథకాలు, పరిపాలనా దుబారా ఖర్చులే ప్రధాన కారణమని డీఎన్ఏ విత్ భరత్ డిబేట్ కార్యక్రమంలో విశ్లేషించారు.
KCR NTR The Paradise Movie: నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ది ప్యారడైజ్ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే ఈ సినిమాలో కొన్ని అతిథి పాత్రలో అభిమానులను ఎంతో మెప్పించాయి. తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులైన ఎన్టీఆర్, కేసీఆర్‌లను పోలిన పాత్రలు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇంతకీ ఆ పాత్రల అవసరం ఏంటి? ఆ పాత్రల్లో నటించిన నటులెవరో ఇప్పుడు తెలుసుకుందాం.